Tuesday, March 10, 2015

ఇది పిచ్చి సుబ్బయ్య కధ
--------------------------
అదే ఆంజనేయ స్వామి గుడిలో పూజారిగారికన్నాముందుగా  హాజరయే ఓ వ్యక్తి
పూజారి వెళ్ళింతర్వాత మాత్రమే వెళ్ళే వ్యక్తి,పిచ్చి సుబ్బయ్య.
ఎప్పుడూ అదోలోకంలో మాలోకంగా అమాయకంగా వుండే వాడు.
ప్రతిరోజూ గుడికి హాజరయే అంకిత భక్తుడు సుబ్బయ్యే.

ఓ మూల కూర్చుని భజనరోజుల్లో తాళాలుపట్టుకుని ధ్యానమగ్నుడై
వుండే వాడు.మహాయోగిపుంగవుడిలా కనులు మూసుకుని పరధ్యానంలో వుండే వాడు.అది యేదేవుడి ఊరేగింపయినా ముందు వరసలో దేవుడిపటం పట్టుకుని ఇంకోలోకంలో విహరిస్తూన్న అవధూతలా వుండే వాడు.
బేధమల్లా ,అవధూతల్లా అర్ధ నగ్నంగానో అసలు నగ్నంగానో వుండడీ సుబ్బయ్య. ధోతీ[ముతక ఖద్దరు కట్టుకునిపైన కేవలం ఓ తువ్వాలు మాత్రం వేసుకుని తిరుగుతుండే వాడు. రోజూ 9 గంటలనుండీ
వూరిలో ఎవరొకరింటిలో భజనలు నిరంతరం జరుగుతుండే వి.అక్కడా సుబ్బయ్య హాజరయే వాడు. సుబ్బాయ్య అనారోగ్యం పాలయాడని తెలిసిన రోజు ఒక్కటీ కనబడదు. అది నిజంగా యోగమే గదా మరి.
సంసారం పిల్లలూ వున్నారు. అయినా అదో అయోమయం మనిషిలా
భక్తి పారవస్యన్లో తిరుగుతూ వుంటాడు.వేనుగోపాలస్వామి ఊరేగింపులో ముక్కు స్వామి[గరుత్మంతుడి] ప్రక్కగా తనూ నిలుచుని వుండే వాడు. ఇక పుష్య మాసం వచ్చిందంటే నెలరోజుల పాటు
తెల్ల వారుఝామున నలుగురు భక్తులు తాళాలు వాయించుకుంటూ
ఊరు నాలుగు బజార్లూ క్రమం తప్పకుండా తిరిగే వారు. ఆ భజన సమాజంలో
దేవుడి పటం పట్టుకుని ముందు నడవడానికి సుబ్బాయ్యే ఉండె వాడు..
చలీ గిలీ సుబ్బయ్యకు జాంతానై అన్ని ఋతువుల్లోనూ అదే ఆహార్యమే.
ఎవరన్నా ప్రసాదమిస్తే కళ్లకద్దుకునీమరీ తీసుకునే వాడు.
ప్రతిప్రసాదాన్నీ ఇంటికే పట్టుకెళ్ళేవాడు.ఇంట్లో వాళ్ళూ ఆయన ధోరణిని నిరసించినట్లు ఋజువులేవీ లేవు.
సుబ్బయ్య లేని డేవుడిగుడినేఎ,ఊరేగింపునూ  ఎవ్వరూ ఊహించుకోలేరు.ఇక స్రీరామ నవమి పండగొస్తే అది సుబ్బయ్య పండగే.తాటాకు పందిళ్లు వెసే దగ్గరనుంచీ  పండగయాక గుంజలు పీక్కెళ్ళేదాకా సుబ్బయ్యదే
కుశాలంతా.అలాగే హనుమజ్జయంతినాడు సుబ్బయ్య హాజరయి అన్ని కార్యక్రమాలూ నిర్విఘ్నంగా జరగాలని కోరుకునె వాడిలా
పరమ ఉచ్చిలితో హుషారుగా వుండే వాడు.శ్రీరామ నవమి దాటాక మా వూరి లో వసంతం బండి ఊరేగేది.గంగాళం నిండా రంగునీళ్లతో
నలుగురైదు పిల్లలు బండిమీదకెక్కి పిచికారీ జల్లే వారు.ఎవరింటిదగ్గరయినా ప్రసాదం పళ్ళెంలో తెస్తే సుబ్బయ్యే అందుకుని పూజారిగారికిచ్చి కొబ్బరి కాయ కొట్టాక ప్రసాదం
కొబ్బరి చిప్పతో తిరిగి వాళ్ళకందిచే పని మా సుబ్బయ్యదేసుమా!!
===================================================


కట్టుబాటులో కవిత్వమా? సంకెళ్ళలో సంగీతమా?
===============================================

పూర్వం కవులకు చందస్సులూ,యతిప్రాసలు నియమనిబంధనులుగానిలిస్తే ఆధునికులకు సామాజిక
 స్పృహ కట్టుబాటై కొందరిని శ్రంఖలా బద్ధులను గావించింది.

ఫలితంగా ఆనాటి శ్రీ శ్రీలాంటి కవులకు కార్బన్ పేపర్లలా కొందరు కవితలు వెలువడి ఒకరకంగా మూసదారిలో నడిచాయనే చెప్పుకోవచ్చు.
నిరంకుశంగా వుండవలసిన కవిని నియమ బద్ధం గావించడమంటే
సంగీత కారుణ్ణి సంకెళ్ళలో బంధించి కచ్చేరీ చేయమనడం 
లాంటిదే. ఇక ఆ గాయకుడికి ఏం స్వేచ్చ లభిస్తుంది?
అలాగే క్రాతదర్శిగా రూపొందవలసిన కవికుమారుడిని కట్తుబాట్లలో కట్తిపడేస్తే కవి ఎంత స్వతంత్రంగా కవిత్వం రాసి వినిపించగలుగుతాడు.

స్పందన కళాకారుడికి సహజసిద్ధంగా కలుగుతుంది.
ఇతరుల బలవంతం వల్లవచ్చే స్పందన అభినందనలందుకునే స్థాయిలో కవితను రూపొందకుండా అడ్డుపడుతుండి.కేటలాగుకవిత్వానికీఅదరణ లభిస్తుందా?

ప్రతి హృదయాన్నీ రంజింపజేసే కవితలు వెలువడాలంటే
కవిని నియంత్రణలకు దూరంగా తన కవితారచన చేసుకునే
వీలు కలిగించాలి.అప్పుడే విశ్వ శ్రేయోదాయకమైన కవితలు వెలువడె వీలు యేర్పడుతుంది.తన కవితా సృష్టినీ, దృష్టినీ ఏకాగ్రతతో లగ్నం చేసుకునే వీలు యేర్పడుతుంది.అప్పుడే కవికూడా కారణజన్ముడన్న మాటకు సోదాహరణంగా నిలబడగలుగుతాడు.
====================================================