పరుషమై సరళమై -------------------రావెల పురుషోత్తమ రావు.----------------------జీవితం చిత్రాతి చిత్రమైనది.వెలుగు వేళల్లో వేదనాక్రాంతయౌతుంది.చీకటి సమయాల్లో చిరునవ్వులు చిందిస్తుంది.ఒక్కోసమయంలో ఒక్కో విధంగా స్పందిస్తుంది.గుండె గొంతుకతో గునాళించేలా మట్లాడడమూ నేర్చుకుంటుందిఅవసర సమయాల్లో ఆలోచనలకుఅసలు ఆస్కారమంటూ ఇవ్వకుండాఆగ్రహోదగ్రమై అగ్ని వర్షం కురిపిస్తుంది.జీవితనేపధ్యమే అలాదు.యవ్వన దశలో జలపాతంలాఎగిరెగిరి పడుతుంది,నడివయసు రాగానే నలుపుతెలుపుల వెనుకరంగుల కలలనే కంటుంది.అసుర సంధ్యవేళకు అంతా ఆశలుడిగిన ప్రాణిలాఅడుగడున దిగులు మొహంతోనే దర్శనమివ్వ జూపుతుంది.వెలుగులనదుకునే వేళలోనే తిమిరానికి సమర ఝంఝను చూపించాలీ,వినిపించగలగాలి,నీడల జాడలను స్పృశిస్తూ నిమ్నోత్తాలనుకది[ఏలా కృషిచేయ డానికి ప్రయత్నం సాగించాలి.సందర్భమేదైనా సరిగ పదమని శాసించే స్థితికి ఎదగ గలగాలి.పరుష సరళాలలోనూ ప్రత్యేక దిశగా సాక్షాత్కరించడమేజీవితపు వైవిధ్యమని గుర్తెరిగి జవాబుదారిగాజీవితాన్ని ఆవిషరించుకో గలగాలి. మలచుకొని మహోన్నతంగా నిలవాలి,^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
No comments:
Post a Comment