Monday, February 16, 2015

వలపు వాన
---------------

కొండ కోనలలోన
వెండి వెన్నెలవోలె
వలపు తలపుల తడిసి 
మెరిసి మురిసెను వలపు.

 అడవి దారుల తిరిగి
మధుర ఫలముల మేసి
రమ్య భావనలరసి
రాగరంజితమగుచు
రాణకెక్కెను వయసు

యేడ నున్నదొ తాను
నేను ఎరుగగలేను
వెదకి తెలుపుడు మీరు
అప్సరో భామినుల
అంతరంగములాన
ధన్యునిగ తలతును
మీరలిచ్చెడు సేవ
మరువజాలను మదిన
ప్రతిభ బడసిన మీరు
పరాకు పడుటే తగదు
ఈ తరుణీ అలామ
అరుణారుణపు  తీరు 
కాంతిరేఖయె సుమ్ము
వెదకి చెప్పిన చాలు
వేల వేల వరహాలు
వరుమానమనుకొనుడు.

చీకటాయెను బ్రదుకు
గొంతు దిగదే మెతుకు?
కడలి మించెను కనులు
ధారలుగ ప్రవహించు
అశ్రు సరసులతోడ.
---------------------------------------

Sunday, February 15, 2015

పరుషమై సరళమై -------------------రావెల పురుషోత్తమ రావు.----------------------జీవితం చిత్రాతి చిత్రమైనది.వెలుగు వేళల్లో వేదనాక్రాంతయౌతుంది.చీకటి సమయాల్లో చిరునవ్వులు చిందిస్తుంది.ఒక్కోసమయంలో ఒక్కో విధంగా స్పందిస్తుంది.గుండె గొంతుకతో గునాళించేలా మట్లాడడమూ నేర్చుకుంటుందిఅవసర సమయాల్లో ఆలోచనలకుఅసలు ఆస్కారమంటూ ఇవ్వకుండాఆగ్రహోదగ్రమై అగ్ని వర్షం కురిపిస్తుంది.జీవితనేపధ్యమే అలాదు.యవ్వన దశలో జలపాతంలాఎగిరెగిరి పడుతుంది,నడివయసు రాగానే నలుపుతెలుపుల వెనుకరంగుల కలలనే కంటుంది.అసుర సంధ్యవేళకు అంతా ఆశలుడిగిన ప్రాణిలాఅడుగడున దిగులు మొహంతోనే దర్శనమివ్వ జూపుతుంది.వెలుగులనదుకునే వేళలోనే తిమిరానికి సమర ఝంఝను చూపించాలీ,వినిపించగలగాలి,నీడల జాడలను స్పృశిస్తూ నిమ్నోత్తాలనుకది[ఏలా కృషిచేయ డానికి ప్రయత్నం సాగించాలి.సందర్భమేదైనా సరిగ పదమని శాసించే స్థితికి ఎదగ గలగాలి.పరుష సరళాలలోనూ ప్రత్యేక దిశగా సాక్షాత్కరించడమేజీవితపు వైవిధ్యమని గుర్తెరిగి జవాబుదారిగాజీవితాన్ని ఆవిషరించుకో గలగాలి. మలచుకొని మహోన్నతంగా నిలవాలి,^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

మౌనం గా వస్తావునిశ్శబ్దంగా నిష్క్రమిస్తావుపౌర్ణమి లా విస్తరిస్తావుఅమావాస్యలా అదృశ్యమౌతావునా కలల కౌగిలిలోఅనుబంధమై హత్తుకుంటావుఆత్మీయతలా అల్లుకుపోతావుప్రణయమా! నీకు ప్రణామాలు.

Saturday, February 7, 2015

సదసత్సంశయం.
---------------
ఒకప్పుడు కారడువుల్లొ మాత్రమే
కాకులు కాపురం ఉండేవని వినికిడి.
ఇటీవలి కాలం దాకా ఇంటి పెరటిగోదపైనుండి కాకి అరిస్తే
చుట్టాలొస్తారని అనుకునే ఆనవాయితీ ఉండేది.
ఇప్పుడు కాకుల జాడే కనుమరుగయే స్థితికి జారుకున్నాం.
చని పోయిన వారికి పిండం పెట్టడం గూడా దండగేనని భావించే
కల్కికాలంలో కాలూనడం కూడా వ్యర్ధమని భావించాయేమో
లేదా నీతి కధలోలాగా కుండల్లో నింపడానికి నీరుంచే వారే లేరని
ఈ కఠినమైన నిర్ణయాని కొచ్చివుంటుందని నా సదసత్సంశయం.
------------------------------------------------------------------------------------------------------
ఏక్కడో ఆకాశం నుంచి
ఊడిపడ్డ అప్సరసలా
మంచు తునకను 
మించిన అందంతో 
అపురూపంగా నువ్వు.
క్షణకాలం కూడా
శాంత స్వరూపంలా 
ఉండలేని కుపిత మనస్కుడనై
దైనందిన మార్తాండునిలా
ఆగ్రహోదగ్రంగా నేను
ఇద్దరం పార్వతీ పరమేశ్వరుల్లా
ఎలా కలిసిపోయామోచూడు!
ప్రణయానికి పరిధులా? అంటూ
పరిహసించగలలోకానికి
సోదాహరణం మేమేనంటూ
పరవశింపజేస్తున్న ప్రణయమా! నీకు జోహార్లు!
-------------------------------------------------------------------------------------------------------
ప్రణయాంజలి-2
---------------------
మందార మకరందపు
మాధుర్యమే నువ్వు
మల్లెల గునాళింపులో
సురభిళ పరిమళమే నువ్వు.
నువ్వు మనసును
రంజింపజేయగల రాగానివి.
చిత్త చాంచల్యం కలిగించగల
సౌందర్య లలామము.
అందుకే ప్రణయమా ! నీకు
శతసహస్ర ప్రణామాలు.
-------------------------------------
పల్లె పదం
****************
కనులలో సంక్రాతి కాంతులే గనరావు
ఆకాశ హర్మ్యాలు అడ్డుగాన 
ఇంటిలో మెట్టుపై ఇంపుగా కనపట్టు
ధాన్యపు బస్తాలు ధాటిలేదు
ఎడ్ల బండులులేవు గొడ్ల పాకలు లేవు
పాడి పంటల వూసు పనికి రాదు
పార్టీల వారిగా ప్రజలు వేరుగ మారె
సంక్షేమ మరసెడు సభ్యులెవరు
పల్లె గూటిలొ పక్షులే తల్లడిల్లె
సుఖము శాంతియు క్షోభగా పరిణమించె
ఏడనుండెను పండుగ ఏడ పరువు?
పల్లె తల్లికి కన్నీటి భాగ్య మబ్బె.
*********************************
సంభవామి దినే దినే-----
==========================
ఎక్కడో పిడుగు పడిన చప్పుడు
ఇది అరాచకంగా పిల్లలను
కిరాతకంగా,పరమ క్రూరంగా
అకాల మృత్యువు పాల్జేస్తున్న
ఆటంక వాదులను హరిస్తే బావుండు.
మతం మాటున మూర్ఖంగా కప్పుకున్న ముసుగులో
మారణ హోమానికి ద్వారాలను తెరుస్తూ
నానాటికీ మృగ్యమై పోతున్న మానవత్వానికి
కారణ భూతులై నిలిచిన కసాయీల మీదపడి
వారి వికృత ప్రణాళికలకు కపాలమోక్షం సంభవిస్తే
ఎంత బావుంటుందో--మళ్ళీ మరోమంచి భారతాన్ని పునర్నించుకోవచ్చు.
మిట్ట మధ్యాహ్నమే నడివీధిలో నలుగురూ తిరుగుతున్న సమయంలోనే
కసు గాయల్లాంటి కన్నె పిల్లల శీలాన్ని హరించే
మగ మృగయా వినో దుల మీదపడి ఆ మృగ జాతిని అంతమొందిస్తే ఎంత బావుణ్ణు.
అప్పుడే ఈ పిడుగు పాటుకు సమయోచితమైన సార్ధకత సంప్రాప్తిస్తుంది.
------------------------------------------------------------------------
నామాoతరం
---------
తన పేరు మరచాను
మరోపేరుతో పిలిచాను
కోపం రాని కోయిల
కమ్మగా పాడింది.
పేరుతోగాదు స్వరంతో
గుర్తు పట్టు చాలు నంటూ
చిలిపిగా నవ్వింది.
========
ఒక దీపం దిగులుగా చెప్పింది
ఇతరుల జీవితాలను కొండెక్కిచ్చ వొద్దని!
ప్రేమ పెల్లుబికేలా అరిచింది
ఇతరుల హృదయాలను ద్వేషిచండం మానుకొమ్మని,
-----------------------------------------------------------------------
శుభ కామన----రావెల పురుషోత్తమ రావు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
పయనించే చిలుకనే నేను
పాడుబడిన గూడయినా
పాత బడిన ఇల్లయినా
నాకు నివాస యోగ్యమైనవే.
కొత్త పాతల మేలు 
కలయిక కావాలన్న
తాపత్రయం పడలేదెప్పుడూ.
తలదాచుకోగలిగే స్థలం చాలులెమ్మని
సర్దుకు పోయే మనస్తత్వమే నాది.
ఒంటరితనం వేధిస్తున్న వాళ్ళ చెంతకుజేరి
అనునయ వాక్యాలు పలికి ఊరడిస్తుంటాను.
పచ్చని చెట్తుపై పైరగాలుల ఫలహారాలను
భుజించాను ఒకప్పుడు. వసంతకాలపు వైదగ్ధ్యాన్ని
వివరంగా అనుభవించాను.
శిశిరకాలంలో శీర్ణ పత్రాలనుచూస్తూ
కాలం వెళ్ళబుచ్చిన ఘనత నాకున్నది.
తిరమై సంపదలెల్ల ఒక రీతిన సాగిరానేరవని
నమ్మిన ప్రాణిని నేను.
బాగా బతికినాకూడా భ్రమలకు దూరంగా
కాలాన్ని వెచ్చించిన ఘనాపాఠీని కూడానేనే.
ఆచరించిన ధర్మం అమూల్యంగా ఆర్జించిన కీర్తి
చిరంతనంగా తోడుంటాయని నమ్మిన చైతన్యాన్ని నేను.
అందుకే నాకు నరజాతిపైన గాఢమైన అనురాగం.
పలికేనాలుగు పలుకులూ నొప్పింపక నేనుగా నొవ్వకుండా
శుభ సూచనలుగా అందరి శుభం కోరుకుంటూ కామనల నందిస్తున్నాను.
********************************************
ఇద్దరంకలిసి నడచినంత కాలం
ఇబ్బడిముబ్బడి గ సంతోషమే సామ్రాజ్యమే మఇంది.
నువ్వు దూర దూర తీరాలకు సాగిపోయాక
ఒంటరిగా కాలం వెళ్ళదీయడంకష్ట తరమనిపిస్తుంది.
పిడుగు పడింది ఎక్కడోనయినా 
భయం మాత్రం నా గుండె లోకె పరుగెడుతున్నది.
పూలన్నీ వాడినట్లుమొహం చాటేసినా
పరిమళ గంధం నన్నువీడ బోదన్నది 
మాత్రం ప్రత్యక్షర సత్యం.
========================



Thursday, February 5, 2015

Click to reply all

    Wednesday, February 4, 2015

    ప్రేమాయణం
    ============

    నువ్వు నన్ను ప్రేమించావా?
    సరే !ఆ పూల మొక్కనడిగి చూడు.
    వడలి పోయి, రెక్కలు రాలి పడి
    ఎంత కళాహీనంగా కనిపిస్తున్నదో చూడు.
    అది మన ప్రేమ పురస్సరంగా నువ్ నాటిన మొక్కేగదా!
    సరయిన పోషణ లభించక చిక్కి ఏలా శల్యమైంది గమనించు.

    నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా?
    వేయి శకలాలుగా కూలబడ్డ ఈ హృదయా న్ననడుగు.
    అంటుకోవడానికి వీలు కాని విధంగా వ్రక్కలుజేసి
    అలమటింపజేసావు గదా, ఈ సున్నిత హృదయాన్ని.

    ప్రేమంటే అర్ధం తెలుసుకో!
    ప్రేమించడంలోని అంతరార్ధం గ్రహించు!!.
    మరోజన్మలోనయినా ప్రేమ సాఫల్యతను గురించి
    నీకు బోధ పడే వీలుకలుగుతుంది.
    ప్రేమ అనే పదం సార్ధకమై గెలిచి నిలుస్తుంది.!!!
    ==================================

    Tuesday, February 3, 2015

    క్రీడాభి రామం
    ------------------------
    అన్ని ఆటలూ
    జీవిత గమనంలో
    ఆడే సాను,
    అనుకున్నదే తడవుగావిధి తనంతట తానేఎవ్వరి అంగీకారం అందుకోకుండానేతనవంతు ఆటలు నాపై ఆడేసింది.ఇక ఇప్పుడు యే ఆటపైనా మోజులేదు.
    కవితావిన్యాసలతో
    కాలక్షేపానికే ఇక శెష జీవితం.
    యే ఆటా ఆడలేని నా సుమనస్సును
    మన్నించడమేనండీ మీ వంతు సాయం.

    *********************************************************