Saturday, January 31, 2015

కధ కంచికి మనంలోపలింటికి.
------------రావెల పురుషోత్తమరావు
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్
అతను పెద్ద నేరంచేసాడట
క్షుద్బాధకు తాళలేక
ఓ బన్రొట్టెను దొంగతనం చేసాడట.
రక్షకభట సమూహం అతనిపై నేరం మోపుతూ
న్యాయస్థానంలో ఓ వ్యాజ్యం వేసింది.
కళ్ళు పూర్తిగా మూసుకుపోయిన న్యాయస్థానం
తనవంతు కృషిగా అతనికి ఉరిశిక్షను విధించింది.
ఆతర్వాత దొంగలు దొంగలు మరోలోకంవెళ్ళాక
న్యాయాన్ని సమీక్ష ద్వారా పంచుకున్నారు.
ఒకరినొకరు ఉరితీసుకోవాల్ని తీర్మానించుకున్నారు.
వాళ్ళకు వాళ్ళే శిక్ష అమలయ్యేలా చూసుకున్నారు.
అందరిదేహాలూ ఉరికంబానికి వ్రేలాడడం మొదలెట్టాయి.
మంచి మనసును నమ్ముకున్నమనుషులంతా మౌనదీక్ష జేసి
మూగ ప్రేక్షకులుగా ఇహలోకంలో మిగిలిపోయారు.
ఇక కధ కంచికి మనo లోపలింటికి..
-----------------------------------------------------------------------
దంత వేదాంతం
---------------------
ఈదంతాలకెంత పొగరో
వయసు మీదపడకముందు
ఒక్కొక్కటే రాలిపడి
తొర్రిపళ్ళల్లో తొండచిక్కిందని
అందరూ వెక్కిరించేలా చేస్తుంది.
ఈదంతాలకెంత బిగుతో
వయసు మీదపడి శరీరం
కట్టెలపొయ్యిమీదకెక్కి
దేహమంతా చితాభస్మమై
మిగిలినా మేం రాలిపడం పొమ్మంటూ
భీష్మించుకుని అలానే ఉండిపోతాయి.
ఎవ్వరూ ఎప్పుడూ నా పళ్ళు రాలగొట్టే
పనులేవీ నేప్పుడూ చేయలేదు
సుమా అనుకుంటూ
సగర్వంగా చెప్పుకుని మురిసిపోతుంటాయి.
ముచ్చటపడుతూంటాయి.
అలామనిషి బూడిదయినా చెక్కుచెదరనిది
దంత సౌందర్యమేనని ఎందరికి జ్ఞప్తికొస్తుంటుందో!
----------------------------------------------------------

Wednesday, January 28, 2015


అచలం--అమోఘం *************
 ఏడు పదులు సమీపిస్తున్న నాజీవన యానంలో
 ఎందరి జన్మలను చూసాను ఎందరి మరణాలగూర్చో విన్నాను.
 జననమప్పుడు పొంగిపోలేదు మరణాలప్పుడూ కృంగినట్ళులేదు
 ఈ ఆకాశం,చంద్రుడూ సూర్య భగవానుడూ లోయలూ కొండలూ కోనలూ
 అలాగే చలనరహితంగానే ఉన్నాయ్. జననమైనా మరణమైనా ప్రతి ప్రాణికీ సహజమని తెలిసాక
 భ్రమలను తొలగించుకున్నాను భయాన్ని దూరం చేసుకున్నాను.
 నిశ్చలంగా నిలబడి వుండడంలోని లౌక్యాన్నీ,సౌఖ్యాన్ని గ్రహించాను.
ఇక జర రుజలపట్ల మౌనం వహించడమే మేలనుకుంటున్నాను ===========================